News June 20, 2024
HYD: వచ్చేసారి PM రాహుల్ గాంధే: నిరంజన్

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చేసారి ప్రధాని అవ్వడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడని కొనియాడారు. విద్యావంతుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి అని అన్నారు. భారత్ జోడో యాత్రతో తన సత్తా ఏంటో దేశానికి చూపించారని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
HYDలో ఇక ‘RED’ నోటీసులు

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.
News March 5, 2026
నాగోల్: CM రేవంత్‌కు KTR వార్నింగ్

CM రేవంత్ ఇల్లు రెడ్డి కుంటలో ఉందని KTR అన్నారు. నాగోల్ STP పరిశీలన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. CM సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువులో ఉందని, మంత్రుల ఇండ్లు కూడా చెరువుల మధ్యలో ఉన్నాయని ఆరోపించారు. వాటిని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే పేదవాడి భూమికి రిజిస్ట్రేషన్లు ఉన్నా కూల్చివేస్తున్నారని.. కానీ, పేదలు కుర్చి మడతపెట్టి కొట్టే రోజులు వస్తాయని CMకు KTR వార్నింగ్ ఇచ్చారు.
News March 5, 2026
HYDలో వరుస ప్రమాదాలు.. జాగ్రత్త!

సిటీలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో ఉదయం మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచిస్తున్నాయి.


