News June 20, 2024
పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పలనాయుడు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గురువారం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News March 28, 2026
నరసాపురం: కారు ఇప్పిస్తానని బంధువుకే టోకరా..!

తక్కువ ధరకే కారు కొనిపిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు కాజేసిన వ్యక్తిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు వివరాలు.. బాధితుడు యర్లగడ్డ ప్రదీప్ కుమార్‌కు బంధువైన గాబ్రియేల్ రాజు(హైదరాబాద్), వివిధ విడతల్లో నగదు తీసుకుని మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు కొనివ్వకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే నిరాకరించడంతో ప్రదీప్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.
News March 28, 2026
భీమవరం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

ఈనెల 28న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పింఛన్లు వంటి అంశాలపై ప్రతిభావంతులు తమ అర్జీలను అందజేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.


