News June 20, 2024
ప్రకాశం: నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ

TDP అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై ఆ పార్టీ నాయకుల ఆశలు పెరుగుతున్నాయి. వీటితోపాటు రేషన్ డీలర్‌షిప్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టుల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఓ నియోజకవర్గ స్థాయిలో 150 నుంచి 170 వరకు, మండల స్థాయిలో 40-60 వరకు వివిధ రకాల పోస్టులు ఉన్నట్లు TDP శ్రేణులు క్షేత్రస్థాయిలో లెక్కలేసుకుని తమకు ఏ పదవులు కావాలో నిర్ణయించుకుంటున్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.


