News June 20, 2024
ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగంతో DCM పవన్ భేటీ
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన పవన్ నేడు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో భేటీ అయ్యారు. ఉదయం 10 గం. నుంచి అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తన మార్క్‌ను చూపుతున్నారు.
Similar News
News February 4, 2025
‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.
News February 4, 2025
ఆస్తులపై పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం: కేంద్ర హోంశాఖ
విభజన సమస్యలను తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై AP, TG అధికారులతో ఆయన చర్చించారు. ఆస్తులు తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు సమాచారం.
News February 4, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుజనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యలేని నీచుడి దగ్గరకు వెళ్లకూడదు. వాటి వల్ల ప్రమాదం ఉంటుంది.