News June 20, 2024
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్ గురువారం మంగళగిరిలో మధ్యతరహా పరిశ్రమ, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనవంతుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
VZM: ఉపాధి హామీ పనులకు వెండర్లకు శిక్షణ

విజయనగరంలోని స్థానిక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వెండర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు సంబందించి ఆన్‌లైన్‌లో టెండర్లు దక్కించుకోవడంపై అమరావతి పీఆర్ఆర్డీ కార్యాలయ అధికారి గోపీచంద్ వెండర్లతో పాటు అధికారులకు అవగాహన కల్పించారు. పనుల నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారద పాల్గొన్నారు.
News November 4, 2025
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండండి: VZM JC

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని JC సేథుమాధవన్ పేర్కొన్నారు. అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామన్ వెరైటీకి క్వింటాకు రూ.2369, గ్రేడ్-ఏ రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల గోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News November 4, 2025
VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.


