News June 20, 2024
కళ్యాణదుర్గం: యువకుడిపై పోక్సో కేసు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 17ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు పండ్లు ఇస్తానని ఆశచూపి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి పిల్లలు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News March 5, 2026
బెంబేలెత్తుతున్న అనంతపురం జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో అనంత జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గుంతకల్లు మండలంలో 39.8, యల్లనూరులో 38.4, పెద్దపప్పూరులో 38.3, తాడిపత్రిలో 37.7, బి.సముద్రంలో 37.6 డిగ్రీలు నమోదయ్యాయి.
News March 4, 2026
‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
News March 4, 2026
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై దుష్ప్రచారం

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1993 డిసెంబర్ 21న పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను తాజాగా జరిగినట్టుగా, బంగారు విగ్రహాల విలువ రూ.150 కోట్లుగా వక్రీకరిస్తున్నారు. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విగ్రహాల విలువ రూ.50 వేలుగా నమోదు చేసి, 1994లో కేసు మూసివేశారు.


