News June 20, 2024

భారత బౌలర్లందర్నీ లక్ష్యంగా చేసుకుంటా: గుర్బాజ్

image

T20 WC సూపర్‌-8లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుంటానని అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘మేం ఏదో ఫార్మాలిటీకి ఆడట్లేదు. కప్ గెలవడం మా లక్ష్యం. టీం ఇండియా బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి పెంచుతా. అయితే ఔట్ అవుతా లేదా దూకుడుగా ఆడతా’ అని తెలిపారు.

Similar News

News March 22, 2026

చచ్చిపోవచ్చుగా అన్నారు: వరుణ్

image

తన IPL కెరీర్‌లో 2021 సీజన్ దారుణంగా గడిచిందని KKR స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో కొవిడ్ సోకిన తొలి ఆటగాడిని నేనే. ఆ తర్వాత సందీప్ వారియర్‌కూ వచ్చింది. దీంతో టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఆగిపోవడంతో అభిమానులు కోపంతో నన్ను తిట్టారు. చచ్చిపోవచ్చుగా అన్నారు’ అని ఓ షోలో చెప్పారు. కాగా ఆ ఏడాది IPL రెండో దశను UAEలో నిర్వహించిన విషయం తెలిసిందే.

News March 22, 2026

ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

image

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.

News March 22, 2026

ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

image

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్‌లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.