News June 20, 2024

అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం: సీఎం

image

AP: అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు.

Similar News

News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.

News October 8, 2024

ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!

image

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.

News October 8, 2024

శతక్కొట్టిన సల్మాన్.. పాక్ భారీ స్కోర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ విధ్వంసం సృష్టించారు. 108 బంతుల్లోనే సల్మాన్ (100*) సెంచరీ బాదారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు అబ్దుల్లా షఫీఖ్ (102), షాన్ మసూద్ (151) కూడా సెంచరీలు చేయడంతో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టారు.