News June 20, 2024
వైసీపీకి ఓటేసినవారు విచక్షణతో ఆలోచించాలి: చంద్రబాబు
AP: వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కోరారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు. జగన్ విధ్వంసం భరించలేమని ఇతర రాష్ట్రాల్లో పనులు చేసే వారు సైతం వచ్చి ఓటు వేశారని అన్నారు.
Similar News
News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం
TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
News January 19, 2025
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదిత బిల్లు ఉండనుంది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
News January 19, 2025
ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తాగితే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై ముడతలు తగ్గుతాయి.
SHARE IT