News June 20, 2024

మైపాడు బీచ్‌లో ఆదిశంకర కాలేజ్ విద్యార్థి మృతి

image

మైపాడు బీచ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గూడూరు ఆదిశంకర కాలేజ్‌కి చెందిన కొందరు విద్యార్థులు మైపాడు బీచ్‌కు వెళ్లి సముద్రంలో ఈత కొడుతుండగా వారిలో ఒక విద్యార్థి సముద్రంలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి అతనిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతనిని వెంటనే మైపాడులోని ప్రజా వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్యం అందించినా అతను మరణించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2026

నెల్లూరు: బస్సు ప్రమాదంలో తల్లీ కుమార్తె దుర్మరణం

image

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన తల్లీ, కుమార్తె మృతి చెందారు. తూర్పుయర్రబల్లికి చెందిన నర్సింగు శ్రీను, అతని భార్య ప్రభావతి, కుమార్తె చైత్ర బేల్దారీ పనులు చేసుకుంటూ జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి తన కుమార్తె చైత్రతో కలిసి పొదిలి మండలం ఉన్నగురవాయపాలెంలోని పుట్టింటికి వస్తుండగా బస్సు ప్రమాదంలో చిక్కుకుని ఇద్దరూ మృతి చెందారు.

News March 26, 2026

నెల్లూరు జిల్లాకు 9 పశు ఔషధీ విక్రయ కేంద్రాలు మంజూరు

image

జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరు వారి చాంబర్‌లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 26, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

image

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.