News June 20, 2024

రౌడీయిజం చేస్తే అణిచివేస్తా.. CM వార్నింగ్

image

AP: రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు దౌర్జన్యాలు చేశారని, ఇకపై ఎవ్వరి ఆటలు సాగనివ్వబోనని అన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని రౌడీయిజం చేస్తే నిర్మొహమాటంగా అణిచివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సైతం తప్పు చేస్తే ఉపేక్షించబోనన్నారు. ఉన్మాది పాలన నుంచి దేవుడే ప్రజల్ని కాపాడారని చెప్పారు.

Similar News

News March 10, 2026

జాబ్ హగ్గింగ్.. ఏంటిది?

image

కరోనా తర్వాత ‘క్వైట్ క్విట్టింగ్’, ‘కెరీర్ కుషనింగ్’ వంటి ట్రెండ్స్ చూశాం. ఇప్పుడు ‘జాబ్ హగ్గింగ్’ వంతు. అంటే.. ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా, గ్రోత్ లేకపోయినా.. ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్స్ భయంతో ఉన్నా.. దాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం. ఇది కంపెనీపై ప్రేమతో చేసేది కాదు. బయట పరిస్థితులు బాగోలేక భద్రత కోసం తీసుకుంటున్న కేర్. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే వస్తున్న జీతాన్ని కాపాడుకోవడం అన్నమాట.

News March 10, 2026

IPL షెడ్యూల్‌పై అప్‌డేట్

image

IPL-2026 షెడ్యూల్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 12న బీసీసీఐ సెక్రటరీ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు IANS వెల్లడించింది. తొలుత 20 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేస్తారని పేర్కొంది. కాగా మార్చి 28 నుంచి ఈ మెగా క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు దశల్లో లీగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.

News March 10, 2026

చమురు సంక్షోభం.. చైనా ఎందుకు భయపడట్లేదు?

image

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్నా ఇరాన్ నుంచి 90% ఆయిల్‌ను కొనే చైనా మాత్రం పెద్దగా ఆందోళన చెందట్లేదు. దీనికి కారణం ఆ దేశం నిల్వ చేసుకున్న 1.4 బిలియన్ బ్యారెళ్ల అత్యవసర నిల్వలే. అలాగే చైనాలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల చమురుపై ఆధారపడటం తగ్గింది. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో సరఫరా నిలిచినా రష్యా నుంచి దిగుమతులు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో చైనా ఈ చమురు సంక్షోభాన్ని తట్టుకోగల ధీమాతో ఉంది.