News June 20, 2024

నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన ఉండాలి: ఎస్పీ

image

జూలై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన ఉండాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కళ్యాణమండపంలో పోలీసు అధికారులకు నూతన చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన కలగాలంటే నేర్చుకోవాలనే తపన ఉండాలని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News March 27, 2026

MDK: శ్రీరామనవమి.. ఎస్పీ ప్రత్యేక పూజలు

image

శ్రీరామనవమి సందర్భంగా మెదక్ టౌన్‌లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎస్పీ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. శాంతిభద్రతల కోసం పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేష్, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

News March 27, 2026

ఇంధన కొరతపై వదంతులు నమ్మొద్దు: కలెక్టర్

image

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉందని, బుకింగ్ చేసిన వారికి 100% డెలివరీ జరుగుతోందన్నారు. అవసరానికి మించి నిల్వలు వద్దని సూచించారు. అక్రమ వినియోగంపై తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లు సీజ్ చేసి 23 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని, సమస్యల కోసం 9391942254 సంప్రదించాలని సూచించారు.

News March 27, 2026

మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.