News June 20, 2024
సింగరేణిని నాశనం చేసింది కేసీఆరే: భట్టి
TG: సింగరేణిని మాజీ CM కేసీఆర్ సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ‘సింగరేణి ఉద్యోగాల గని. రాష్ట్రానికే తలమానికం. కానీ బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం మొదలుపెడుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయి’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News February 4, 2025
PGECET, ICET షెడ్యూల్ ఇదే
TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.
☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.
News February 4, 2025
రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
News February 4, 2025
నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి
ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.