News June 20, 2024

కొత్త గనులను దక్కించుకోకపోతే సింగరేణి కనుమరుగు: భట్టి

image

TG: బొగ్గు గనులు ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా BJP తీసుకొచ్చిన చట్టానికి BRS MPలు మద్దతు తెలిపారని మంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు ఉందని మండిపడ్డారు. ‘ఉద్యోగాల గని లాంటి సింగరేణి తెలంగాణకే తలమానికం. ప్రస్తుతం 40 గనుల్లో ఉత్పత్తి జరుగుతుండగా 2030 నాటికి 22 మూతపడనున్నాయి. కొత్త గనులను దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News February 4, 2025

నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి

image

ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

News February 4, 2025

EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500

image

TG: <<15348696>>ఈఏసీసెట్‌కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్‌ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

News February 4, 2025

ఈ నెలలోనే గ్రూప్స్ ఫలితాలు?

image

TG: గ్రూప్-1తో సహా గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ఈనెలాఖరులోగా విడుదల చేసేందుకు TGPSC కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా <<15352858>>గ్రూప్-1<<>> జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి, తర్వాత గ్రూప్-2, గ్రూప్-3 రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల గ్రూప్-1 జాబ్ వచ్చిన వాళ్లు మిగతా రెండింటికి ఎంపికైనా వదులుకుంటారు. దీంతో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని అధికారులు భావిస్తున్నారు.