News June 20, 2024

కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

కావలి జాతీయ రహదారిపై మద్దూరుపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైక్ ఢీ కొట్టింది. బైక్ లారీ కిందకి దూసుకెళ్లింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 25, 2026

నెల్లూరులో ఇద్దరు అధికారులపై వేటు

image

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.

News March 25, 2026

నెల్లూరు జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

image

నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం గూడూరు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

News March 25, 2026

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : మెప్మా పీడీ

image

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించాలని మెప్మా పీడీ లీలారాణి అధికారులకు సూచించారు. మంగళవారం బుచ్చి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం మండీలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద ధాన్యం సేకరించాలని తెలిపారు.