News June 20, 2024
వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి, భూమన
తాడేపల్లిలో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, విజయానంద రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు.
Similar News
News January 28, 2025
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. క్లీనర్ స్పాట్ డెడ్
చంద్రగిరి మండలం, మామండూరు జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్లు లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్లు లారీ క్లీనర్ వెంకటేశ్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
News January 27, 2025
చిత్తూరు: ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి
చిత్తూరు నగరపాలక పరిధిలో సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆసక్తిగల అభ్యర్థులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. రూ.2.50 లక్షలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణం అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు వార్డ్ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు వార్డ్ అమినిటి కార్యదర్శిని కలవాలన్నారు.
News January 26, 2025
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు నగరం మురుకంబట్టు సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. దీంతో ఆదివారం ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.