News June 20, 2024

NLG: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపు

image

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 30తో ముగిస్తుండగా , గడువు తేదీని SEP 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

డిండి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.

News January 21, 2026

NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

image

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.

News January 21, 2026

NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్‌

image

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్‌ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.