News June 20, 2024

అన్‌సెక్యూర్డ్ లోన్స్‌ను అదుపు చేయగలిగాం: RBI

image

సరైన సమయంలో చర్యలు తీసుకోవడంతో విచ్చలవిడిగా అన్‌సెక్యూర్డ్ లోన్స్ మంజూరు కాకుండా అదుపు చేయగలిగామని RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ లోన్స్ మితిమీరకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకోవడం మంచిదని భావించామన్నారు. పర్సనల్ లోన్స్, స్టూడెంట్ లోన్స్, క్రెడిట్ కార్డులు మొదలైనవి ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్ పరిధిలోకి వస్తాయి. ముంబైలోని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News January 8, 2025

‘గేమ్ ఛేంజర్‌’ టికెట్ ధరల పెంపు

image

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతిస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది.

News January 8, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. డిమాండ్ ఎందుకంటే..

image

హిందువులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో ఆలయ ప్రవేశం సర్వపాప హరమని విశ్వాసం. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనమంటే సాక్షాత్తూ ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు. ఏడాదిలో 10రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

News January 8, 2025

బ్యాంకాక్‌లో అంతగా ఏముంది!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్శించడంలో బ్యాంకాక్ ముందుంది. 32.4 మిలియన్ల సందర్శకులను స్వాగతించి బ్యాంకాక్ ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటకప్రాంతంగా నిలిచింది. దీనికి ముఖ్యకారణం అక్కడి పర్యాటక విధానం, సోషల్ మీడియాలో పెరిగిన ఆదరణే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 94 దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ప్రవేశించే విధానం తీసుకురావడమే. బ్యాంకాక్ అంటే మీకూ ఇష్టమా? COMMENT