News June 20, 2024

మౌలిక వసతులపై కేంద్రం పెట్టుబడితో స్టాక్ మార్కెట్లకు జోష్?

image

దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న PM గతిశక్తి వంటి ప్రాజెక్టులతో స్టాక్ మార్కెట్లకు బలం చేకూరుతోందని మోర్గాన్ స్టాన్లీ సంస్థ వెల్లడించింది. L&T, NTPC, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ వంటి సంస్థలు లబ్ధిపొందుతున్నాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణమూ తగ్గొచ్చని పేర్కొంది. FY29కి GDPలో మౌలిక రంగానికి సంబంధించిన పెట్టుబడులు 6.5శాతానికి చేరుతాయనేది మార్కెట్ వర్గాల అంచనా.

Similar News

News January 8, 2025

బ్యాంకాక్‌లో అంతగా ఏముంది!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్శించడంలో బ్యాంకాక్ ముందుంది. 32.4 మిలియన్ల సందర్శకులను స్వాగతించి బ్యాంకాక్ ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటకప్రాంతంగా నిలిచింది. దీనికి ముఖ్యకారణం అక్కడి పర్యాటక విధానం, సోషల్ మీడియాలో పెరిగిన ఆదరణే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 94 దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ప్రవేశించే విధానం తీసుకురావడమే. బ్యాంకాక్ అంటే మీకూ ఇష్టమా? COMMENT

News January 8, 2025

చాహల్‌తో విడాకుల ప్రచారం.. ఇన్‌స్టాలో ధనశ్రీ పోస్ట్

image

చాహల్‌తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.

News January 8, 2025

అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి

image

TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్‌లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.