News June 20, 2024
టీటీడీ ఛైర్మన్‌గా ఏలూరి సాంబశివరావు.?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రిమండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.
Similar News
News March 12, 2026
వీకోట: పేకాట ఆడుతున్న సర్పంచ్ అరెస్ట్

వీకోట (M) రాగిసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI షేక్షావలి తెలిపారు. రామకుప్పం (M) కెంపసముద్రం గ్రామానికి చెందిన గంగాధర్, షేక్ మొహమ్మద్ అలీ, సురేష్, సత్యనారాయణ, రమేష్, PMK తాండకు చెందిన సింగిల్ నాయక్, జంగారెడ్డి, రామకుప్పం సర్పంచ్ మురళితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద రూ.32,550 సీజ్ చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
కుప్పం: తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

కుప్పం పట్టణం గాండ్ల వీధిలో శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో జనం పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి బిడ్డలు మంగమ్మ, ప్రవీణ్, ప్రశాంత్ గాయపడి కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు మరి కొంతమందిపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలిసింది.
News March 12, 2026
ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.


