News June 20, 2024

కృష్ణా: నిరుద్యోగులకు శుభవార్త

image

ఈ నెల 22న మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. 

Similar News

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

image

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 1, 2026

అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

image

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.

News February 28, 2026

కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

image

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.