News June 20, 2024
రేపు ‘KGF 1’ రీరిలీజ్

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘KGF 1’ మూవీ రేపు రీరిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.
Similar News
News January 14, 2026
తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.
News January 14, 2026
పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.
News January 14, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.


