News June 20, 2024
ఒంగోలు: మార్పులకు అనుగుణంగా విద్యాబోధన జరగాలి

అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలు, కె.జి.బి.వి.లు, ఏ.పి.మోడల్ స్కూల్స్ ఒకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు గురువారం కొప్పోలులో కెరీర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News March 19, 2026
మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చాం: స్వామి

కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని మంత్రి స్వామి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని.. త్వరలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను రోడ్డున పడేశారని విమర్శించారు.
News March 19, 2026
ప్రకాశం: శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. విచారణ నిమిత్తం కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీ నియమించారు. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి వివరణ ఇవ్వాలని స్కూల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్లు రిప్లే ఇవ్వకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ అనుమతి రద్దు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.
News March 19, 2026
బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర ట్వీట్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్‌పై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు.. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం’ అని ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంపై అభిమానాన్ని బయటపెట్టారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


