News June 20, 2024

HEART BREAKING దృశ్యాలు

image

తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలను చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. కొందరు భర్తలను కోల్పోతే మరికొందరు తమ తండ్రులు, సోదరులను పోగొట్టుకున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులు శిలువ పట్టుకొని వారి తండ్రుల అంత్యక్రియలకు వెళ్తూ కనిపించిన దృశ్యం కన్నీరు తెప్పిస్తోంది. పదుల సంఖ్యలో మృతదేహాలను ఒకేచోట దహనం చేశారు. ప్రస్తుతం 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News January 8, 2025

చాహల్‌తో విడాకుల ప్రచారం.. ఇన్‌స్టాలో ధనశ్రీ పోస్ట్

image

చాహల్‌తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.

News January 8, 2025

అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి

image

TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్‌లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.

News January 8, 2025

పృథ్వీ షా కఠోర సాధన: పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు ఆయన మైదానం, జిమ్‌లోనూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ట్రాక్‌పై పరిగెత్తుతూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ SMలో పంచుకున్నారు. కాగా జాతీయ జట్టుతోపాటు దేశవాళీ జట్టులో కూడా షా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్‌లో కూడా ఆయనను ఏ ఫ్రాంచైజీ కొనలేదు.