News June 20, 2024

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్

image

18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మెహతాబ్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఈయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణం చేయిస్తారు. 1998లో తొలిసారి ఒడిశాలోని కటక్ ఎంపీగా BJD తరఫున తొలిసారి ఈయన గెలిచారు. తర్వాత వరుసగా 1999, 2004, 09, 14, 19లో విజయం సాధించారు. ఈ ఏడాది బీజేపీలో చేరి విజయ ఢంకా మోగించారు.

Similar News

News December 27, 2025

మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

image

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.

News December 27, 2025

ఉపవాసంలో ఉపశమనం కోసం..

image

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.

News December 27, 2025

RBI‌లో 93 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఆర్బీఐలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ నిపుణులకు గుడ్ న్యూస్. <>RBI<<>> 93పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, సీఏ, సీఏంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in/