News June 20, 2024
కడప: త్వరలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు?

టీడీపీ అధికారంలోకి రావడంతో పోలీసుశాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో సీఐలు, ఎస్ఐల బదిలీలు ప్రారంభమయ్యాయి. బుధవారం కొంతమందిని వివిధ ప్రాంతాలకు మార్చారు. మరో రెండు రోజుల్లో సీఐ, ఎస్ఐలతో పాటు డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. వైసీపీ ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ప్రాధాన్యం లేని విభాగాల్లో ఉన్న వారందరూ ప్రస్తుతం తెరపైకి వస్తున్నారు. కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.
Similar News
News November 10, 2025
పుష్పగిరి ఆలయంలో ఒకే పలకపై శివపార్వతి కుటుంబ విహార శిల్పం

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై ఉన్న అద్భుత కుడ్య శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేశ్ వివరించారు. ఈ శిల్పంలో శివపార్వతులు నందిపై, వారి కుమారులు వినాయకుడు (మూషికంపై), సుబ్రహ్మణ్య స్వామి (నెమలిపై) కుటుంబ సమేతంగా విహరిస్తున్నట్టు చిత్రీకరించారు. మకర తోరణం, అష్టదిక్పాలకులు కూడా ఈ శిల్పంలో చెక్కబడ్డాయి. ఇది ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక అని తెలిపారు.
News November 9, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.


