News June 20, 2024
518 ఫోన్లు రికవరీ చేశాం: ఎస్పీ రాధిక

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ ఫోన్స్ రికవరీపై ఎస్పీ జి.ఆర్ రాధిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సుమారు 72 ఫోన్‌లను ట్రాక్ చేసి ఎస్పీ చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 518 ఫోన్లు రికవరీ చేశామని వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని ఎస్పీ రాధిక తెలిపారు.
Similar News
News March 14, 2026
ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 13, 2026
16 నుంచి ఒంటిపూట బడులు: డీఈఓ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాన్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో మధ్యాన్నం 1 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.