News June 20, 2024

రేపు కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్‌

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్‌ను రేపు సా.6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన తొలి ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News February 17, 2026

నటికి చేదు అనుభవం.. వాష్‌రూమ్‌లో వీడియో తీసి బ్లాక్‌మెయిల్

image

ఓ కన్నడ టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు హాజరవగా అక్కడి వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆమె వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. దానిని ఇన్‌స్టాలో పంపి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2026

ఏఐ సాయంతో పిటిషన్లు.. సీజేఐ ఆందోళన

image

న్యాయవ్యవస్థలో ఏఐ వాడకంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు న్యాయవాదులు పిటిషన్లను ఏఐ సాయంతో రూపొందిస్తున్నారని పేర్కొంది. కల్పిత కేసులు/చట్టాలు, ఉనికిలో లేని జుడీషియల్ కోట్స్‌ను సమర్పిస్తున్నారని తెలిపింది. దీనివల్ల న్యాయ ప్రక్రియ సమగ్రత, నైతికతకు ముప్పు కలుగుతుందని, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ రంగంలో ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమంది.

News February 17, 2026

తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>SVIMS<<>> 26 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఈ నెల 19, 20, 21, 22, 23తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, BDS, డిగ్రీ( సోషల్ వర్క్), BSc(నర్సింగ్), ANM, డిప్లొమా(మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ), పీజీ డిప్లొమా(రేడియోగ్రఫీ, కార్డియో వాస్క్యులార్ టెక్నాలజీ), DMLT, టెన్త్, ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు).