News June 20, 2024

మెదక్: రైల్వే సమస్యలు పరిష్కరించాలని ఎంపీ విజ్ఞప్తి

image

మెదక్ పార్లమెంట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు. పటాన్చెరువు నుండి మెదక్, అక్కన్నపేట వరకు రైల్వే లైన్ పొడగింపు, మెదక్, సిద్దిపేట స్టేషన్ల నుంచి తిరుపతికి రైల్వే సర్వీస్ ప్రారంభం సహా పలు సమస్యలను లేఖలో వివరించారు.

Similar News

News April 6, 2026

మెదక్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

image

బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.

News April 6, 2026

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు

image

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు ఎన్నికయ్యారు. మెదక్‌లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షునిగా సుధాకర్ రాజు, బీవీకే రాజు, సుదర్శన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా వెంకట నరసింహ రాజు, కోశాధికారిగా పూర్ణ చందర్ రాజు, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ రాజు, రామ రాజు, కార్యదర్శులుగా పృథ్విరాజు, మోహన్ రాజు, ప్రచార కార్యదర్శిగా వికాస్ ఎన్నికయ్యారు.

News April 6, 2026

మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.