News June 20, 2024
హైదరాబాద్ నుంచి ZOO PARK తరలింపు.. క్లారిటీ!
HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ తరలింపు అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా, జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు.
SHARE IT
Similar News
News January 15, 2025
HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలో ప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News January 14, 2025
HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.