News June 21, 2024
అఫ్గానిస్థాన్‌పై భారత్ విజయం

T20WC సూపర్-8లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గాన్ 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ తలో 3 వికెట్లు తీశారు.
Similar News
News March 24, 2026
తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.
News March 24, 2026
అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు: హోంమంత్రి

AP: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదవశాత్తు <<19460870>>అగ్నిప్రమాదం<<>> జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. గతంలో అరటి తోటకు నిప్పు పెట్టారని గుర్తు చేశారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదన్నారు.
News March 24, 2026
విగ్రహాల పరిమాణం ఎంత ఎత్తు వరకు ఉండవచ్చు?

ఇంట్లో విగ్రహాలు రెండున్నర అంగుళాల నుంచి 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. మరీ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి శాస్త్రోక్తంగా నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. లోహపు విగ్రహాలైతే పంచలోహాలు, వెండి లేదా రాగితో చేసినవి ఉత్తమం. విగ్రహాలకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. ఒకే దేవుడి విగ్రహాలు రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. శివలింగం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.


