News June 21, 2024

జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తాం: ఎస్పీ దీపిక

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

Similar News

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి కొండపల్లి

image

వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా పెట్టుకుని ప‌ని చేయాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో క‌లిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన కోసం అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

News March 17, 2026

VZM: రేపటి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం రేపటి నుంచి ప్రారంభం కానున్నదని విజయనగరం జిల్లా ప్రజా రవాణాధికారి జి.వరలక్ష్మి తెలిపారు. 40% పైగా వైకల్యం ఉన్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం వర్తిస్తుందన్నారు. అలాగే అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 50% రాయితీ పొందవచ్చు అన్నారు.

News March 17, 2026

VZM: పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీసీ అనంతరం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 9వ తేదీలోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా పాసుపుస్తకాలు తయారు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. మ్యుటేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.