News June 21, 2024
ప్రశంసా పత్రం అందుకున్న పవన్ కుమార్

సార్వత్రిక ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో అందించిన విశేష సేవలకు గాను ఆత్రేయపురం మండల తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఎం.పవన్ కుమార్ ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ మేరకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రెవెన్యూ దినోత్సవ వేడుకలలో ఆయన కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆయనను మండలాధికారుల అభినందించారు.
Similar News
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఏడుగురి పరిస్థితి విషమం

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొందరిని వెంటిలేటర్, డయాలసిస్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
News February 24, 2026
241 రిపోర్టులు వచ్చాయి.. రాజమండ్రి మరణాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!

రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ వైఫల్య ఘటనల నేపథ్యంలో ఎంపీ పురందీశ్వరి మంగళవారం మెడికల్ క్యాంపును పరిశీలించారు. కలుషిత పాలు తాగి నలుగురు మరణించడం, చిన్నారులకు డయాలసిస్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. మొత్తం 293 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా, 241 రిపోర్టులు అందాయని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
రాజమండ్రి: కల్తీ పాల ఘటన.. రంగంలోకి స్పెషలిస్ట్ డాక్టర్!

రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన సమగ్రంగా పరిశీలించారు సరైన ప్రోటోకాల్‌తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.


