News June 21, 2024

భారత మహిళా జట్టులోకి విశాఖ ప్లేయర్

image

దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన మ్యాచులకు విశాఖకు చెందిన మహిళా క్రికెటర్ 17 ఏళ్ల షబ్నమ్ షకీల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో ఇంకా ఒక వన్డే, టెస్టు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. దీంతో ఒకేసారి 3 ఫార్మాట్లకు ఎంపికైన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా షబ్నమ్ నిలిచారు. U-19 WC గెలవడంలో కీలక పాత్ర పోషించిన షబ్నమ్ WPLలో గుజరాత్ తరఫున ఆడారు. కాగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది.

Similar News

News February 4, 2025

రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా

image

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో చోట 500kW నుంచి 2MW ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1MW ఉత్పత్తికి 3-4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. kW పవర్‌కు ₹3.13 చెల్లించి ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

News February 4, 2025

కేసీఆర్‌ కుటుంబానికి ప్రధాని సానుభూతి

image

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 4, 2025

ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్

image

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

error: Content is protected !!