News June 21, 2024

నేడు కేబినెట్ భేటీ

image

TG: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఆగస్టు 15కల్లా రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటన నేపథ్యంలో విధివిధానాలు, అర్హతలపై చర్చించే అవకాశముంది. రైతు భరోసా విషయంలోనూ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Similar News

News February 4, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

image

శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 6 నుంచి AUSతో జరిగే రెండో టెస్ట్ మ్యాచే తనకు చివరిదని తెలిపారు. SL తరఫున 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.

News February 4, 2025

అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్

image

TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.

News February 4, 2025

దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!

image

మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్‌మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.

error: Content is protected !!