News June 21, 2024
నేడు గుంటూరుకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని

కేంద్ర సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు తొలిసారి గుంటూరుకు రానున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు, కార్యకర్తలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం.. శ్రీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News March 10, 2026
ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News March 10, 2026
అమరావతిలో డబుల్ ట్రీ హిల్టన్ హోటల్‌కు భూమిపూజ

అమరావతి ప్రాంతంలోని మందడంలో 200 గదులతో ఫైవ్ స్టార్ డబుల్ ట్రీ (హిల్టన్) హోటల్, 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ.330 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల్లో హోటల్, 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2026
తెనాలి: YCP సోషల్ మీడియా కన్వీనర్‌కు రిమాండ్

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు సోమవారం రాత్రి కోర్టులో హాజరపరిచారు. అంగలకుదురుకు చెందిన ITDP నాయకురాలు జెట్టి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేశామని, అతడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ నాయబ్ రసూల్ చెప్పారు. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.


