News June 21, 2024
తూ.గో.: నకిలీ నోట్లు.. ఇద్దరు అరెస్ట్

నకిలీ నోట్ల చలామణి కేసులో కాకినాడకు చెందిన సింగంశెట్టి సత్య ఫణికుమార్, రాజమండ్రికి చెందిన వంశీకృష్ణతో పాటు పలువురిని అరెస్టు చేశామని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన ఇద్దరితో ముఠాగా ఏర్పడి రాజమహేంద్రవరం కేంద్రంగా కొంతకాలంగా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారన్నారు.
Similar News
News March 11, 2025
తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 11, 2025
కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
News March 10, 2025
రాజానగరం: 12మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్‌ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.