News June 21, 2024

మద్యం విక్రయాలపై CBI విచారణ జరిపించండి: పురందీశ్వరి

image

AP: గత ప్రభుత్వంలో జరిగిన నాసిరకం మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఎక్సైజ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో అవినీతి, ఇసుక దోపిడీపైనా విచారణకు ఆదేశించాలని వినతిపత్రాలు అందజేశారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మద్యం కొనుగోలు, అమ్మకాల లెక్కల్లో 400% నుంచి 500% తేడా ఉందని ఆరోపించారు.

Similar News

News January 29, 2026

RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

image

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్‌ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

News January 29, 2026

ఉపవాసంలో ఏయే పదార్థాలు తీసుకోవచ్చు?

image

ఏకాదశి ఉపవాసంలో ధాన్యాలకు(బియ్యం, గోధుమలు) దూరం ఉండాలి. పాలు, పెరుగు, వెన్న వంటి పాడి పదార్థాలు కొద్దిమేర తీసుకోవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా తినవచ్చు. జ్యూస్ చేసుకుంటే మాత్రం చక్కెరకు దూరం ఉండటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణ ఉప్పు వాడకూడదట. బదులుగా సైంధవ లవణం వాడాలని పండితులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతుండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తినొచ్చు.

News January 29, 2026

మొక్కజొన్న ఆకులు ఈ రంగులోకి మారాయా?

image

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.