News June 21, 2024
పవన్ కళ్యాణ్ పేషీలోకి డైనమిక్ ఆఫీసర్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్(D) కలెక్టర్ కృష్ణతేజ రానున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలనుకుంటున్న పవన్ ఏరికోరి ఆయనను నియమించుకుంటున్నారు. కృష్ణతేజను డిప్యుటేషన్‌పై పంపాలని CBN కేంద్రానికి లేఖ రాశారు. 2015 బ్యాచ్‌కి చెందిన కృష్ణతేజది పల్నాడు(D) చిలకలూరిపేట. కేరళలో పర్యాటకాభివృద్ధి, అలప్పుజ కలెక్టర్‌గా అద్భుత పనితీరుతో కేంద్ర అవార్డులు పొందారు.
Similar News
News January 19, 2025
పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చారు: దామోదర
TG: ఆరోగ్యశ్రీ <<15195303>>సేవలు<<>> నిలిచిపోయాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి వెళ్లారు. మేం ఏడాదిలో పాత బకాయిలతో కలిపి రూ.1130 కోట్లు చెల్లించాం. ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి, 22శాతం మేర ఛార్జీలు పెంచాం. హాస్పిటళ్ల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
News January 19, 2025
జట్టు వెంట ఫ్యామిలీ అదనపు భారం: యోగ్‌రాజ్
టోర్నీల కోసం టీమ్ ప్రయాణాల్లో క్రికెటర్ల కుటుంబాలపై BCCI విధించిన ఆంక్షలను UV తండ్రి యోగ్‌రాజ్ సమర్థించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు జట్టు వెంట ప్లేయర్ల భార్య, పిల్లలు ఎందుకు? వాళ్లు అదనపు భారమే కాకుండా ఏకాగ్రతను దెబ్బతీస్తారు. రిటైర్మెంట్ తర్వాత వారితో ఎంత సేపైనా గడపవచ్చు. ప్రస్తుతం జట్టే కుటుంబం’ అని పేర్కొన్నారు. అలాగే CT కోసం ఎంపిక చేసిన టీమ్ కూర్పు బాగుందని యోగ్‌రాజ్ అభినందించారు.
News January 19, 2025
ప్రజా ధనంతో ఫ్రెండ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్: YCP
AP: ఏ అనుభవం ఉందని ఓర్వకల్లులో ఈ-మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించారని YCP ప్రశ్నిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన TG విశ్వ ప్రసాద్ కంపెనీ కావడం వల్లే ఈ ఒప్పందం జరిగిందని ఆరోపించింది. ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించిన స్నేహితుడికి జనసేనాని ఇలా ప్రజా ధనంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ధ్వజమెత్తింది. కాగా ఈ పీపుల్ గ్రూప్ బ్యానర్ Bro మూవీ నిర్మించింది.