News June 21, 2024

కర్నూలు జిల్లాలో ఏడుగురి తొలిసారి అసెంబ్లీలోకి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ఏడుగురి తొలసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
☞డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
☞కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్
☞పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు
☞ కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి
☞నందికొట్కూరు ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య
☞ఆదోని ఎమ్మెల్యేగా పీవీ పార్థసారథి
☞ఆలూరు ఎమ్మెల్యేగా విరుఫాక్షి

Similar News

News October 5, 2024

స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్‌లతో జిల్ల స్థాయి సమీక్ష నిర్వహించారు.

News October 4, 2024

నంద్యాల: ‘డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తాం’

image

నంద్యాల నందమూరి నగర్‌కు చెందిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన 8 రోజులకు ఆరోగ్యం సరిగాలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు 14 రోజులు ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. అయితే ఆ మహిళ మృతి చెందారు. వైద్య సేవలకు రూ.3.30 లక్షల బిల్లు అయింది. డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధితులు నిరసన చేపట్టారు.

News October 4, 2024

రైతులకు మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేయండి: జేసీ

image

కర్నూలు: రైతులకు మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య CCI (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో DLP కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పత్తి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.