News June 21, 2024
BREAKING.. HYD: కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మృతి చెందిన ఘటన హయత్ నగర్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగింది. కాగా, మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 16, 2026
హైదరాబాద్‌లో ఆదివారం రెడీనా?

ఆదివారం పొద్దున్నే నిద్రలేచి, సైకిల్ ఎక్కి గాలిలో దూసుకెళ్లడానికి మీరు సిద్ధమా?. JAN 18న ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో 57వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ రచ్చ జరగబోతోంది. “ఫిట్‌నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్” అంటూ పుల్లెల గోపీచంద్, దీప్తి జీవంజి వంటి దిగ్గజాలతో కలిసి 6 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగుతుంది.
News January 16, 2026
ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.
News January 16, 2026
హైదరాబాద్ TIMS.. హెల్త్ హబ్ కోసమే! (1)

హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏప్రిల్ 2022లో ఈ మెగా ప్రాజెక్టుకు పునాది పడింది. నగరం నలువైపులా (సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి) సుమారు రూ.4,400 కోట్లతో నిర్మిస్తున్న 4 అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, అధికారం మారడం, నిధుల విడుదల, పరికరాల సేకరణలో జాప్యం వల్ల ఈ ప్రాజెక్టు గడువులు నిరంతరం మారుతూ వస్తున్నాయి.


