News June 21, 2024

డార్క్‌వెబ్‌లో రూ.5లక్షలకు నెట్ ప్రశ్నపత్రాలు!

image

UGC నెట్ పశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన కేంద్రం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం పరీక్ష జరగ్గా సోమవారమే క్వశ్చన్ పేపర్లు డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఒక్కో పేపర్‌ను రూ.5లక్షల నుంచి రూ.6లక్షలకు బేరానికి పెట్టారు. దీన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించి కేంద్ర విద్యాశాఖను అలెర్ట్ చేసింది. అసలు ప్రశ్నపత్రాలతో అవి సరిపోలడంతో పరీక్షను రద్దు చేశారు.

Similar News

News October 8, 2024

కాంగ్రెస్ అంద‌రినీ రెచ్చ‌గొట్టింది: మోదీ

image

హ‌రియాణాలో కాంగ్రెస్ అన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిందని, అయినా ప్ర‌జ‌లు ఆ పార్టీని తిర‌స్క‌రించార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆందోళ‌న‌ల పేరుతో రైతుల్ని, యువ‌త‌ను, కులాల పేరుతో పేద‌ల్ని రెచ్చ‌గొట్టి స‌మాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని మండిప‌డ్డారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. విభజన రాజ‌కీయాలు ఇక ఎంత‌మాత్రం సాగవని పేర్కొన్నారు.

News October 8, 2024

పాక్ రికార్డు బద్దలు కొట్టిన టీమ్ ఇండియా

image

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ మంది ఆటగాళ్లను పరిచయం చేసిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. ఇప్పటివరకు భారత్ 117 మంది ఆటగాళ్లను పరిచయం చేసింది. బంగ్లాతో జరిగిన తొలి టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ (116) రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111), శ్రీలంక (108), సౌతాఫ్రికా (107), ఇంగ్లండ్ (104), న్యూజిలాండ్ (103) ఉన్నాయి.

News October 8, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరా: CM

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.