News June 21, 2024

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News January 21, 2025

ఉగ్రవాదుల కాల్పుల్లో AP జవాన్ మృతి.. CM దిగ్భ్రాంతి

image

J&Kలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ <<15207990>>కార్తీక్<<>> మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News January 21, 2025

బెస్ట్ హనీమూన్ ప్లేస్ ఇదే

image

ప్రపంచంలో బెస్ట్ హనీమూన్ ప్లేస్‌గా మారిషస్ నిలిచింది. ట్రిప్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది ఈ ద్వీప దేశం మధుర అనుభూతులకు నిలయమని ఓటేశారు. ఏడాదంతా 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ దేశం ఇండియన్, ఆఫ్రికన్, ఫ్రెంచ్, చైనా వారసత్వాల కలబోత. సముద్రాలు, సముద్ర జీవులు, బీచ్‌లు, వాటర్ గేమ్స్, గ్రీనరీ, అందుబాటు ధరల్లో లగ్జరీ హాస్పిటాలిటీతో అన్ని ప్రాంతాల వారిని మారిషస్ ఆకట్టుకుంటోంది.

News January 21, 2025

శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల

image

శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను TTD విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా వార్షిక వసంతోత్సవ సేవల టికెట్లు కాసేపటి క్రితం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.