News June 21, 2024
భారీగా పెరిగిన ఎన్ఆర్ఐ డిపాజిట్లు!

విదేశాల్లోని భారతీయులు పెద్ద మొత్తంలో NRI డిపాజిట్ స్కీమ్స్‌లో మదుపు చేస్తున్నారు. ఏప్రిల్‌లో $1.08 బిలియన్లు డిపాజిట్ కావడంతో ఆ మొత్తం $152 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్స్)లో $26 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఎక్స్‌టెర్నల్ రూపీ అకౌంట్‌లో $99 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ డిపాజిట్ స్కీమ్స్‌లో $27 బిలియన్లు వెచ్చించినట్లు తెలిపింది.
Similar News
News September 16, 2025
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.
News September 16, 2025
1,543 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,543 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు. ఇంజినీరింగ్‌లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
News September 16, 2025
భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.