News June 21, 2024
GDK: 26 నుంచి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

ఈనెల 26 నుంచి బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 6, 2026
రామడుగు: రెండు రోజుల్లో పెండ్లి.. ఇంతలోనే దారుణం..!

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
News March 6, 2026
నేడు కరీంనగర్‌కు మంత్రుల రాక: ‘ప్రజా పాలన’పై సమీక్ష

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు శుక్రవారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కీలక సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రగతి ప్రణాళిక అమలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.
News March 4, 2026
కరీంనగర్‌లొ కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ కరీంనగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్టోస్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


