News June 21, 2024

అల్బెండజోల్‌తో రక్తహీనతకు చెక్: DMHO మాలతి

image

పిల్లలను రక్తహీనత నుండీ కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి వెల్లడించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ కార్యాలయంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆమె, డీఈఓ సోమశేఖర శర్మతో కలిసి విద్యార్థులకు మాత్రలు మింగించే కార్యక్రమం ప్రారంభించారు.

Similar News

News March 4, 2026

ఖమ్మం జిల్లాలో నయా మోసం

image

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామంటూ నకిలీ బిల్లులతో రైతులను నమ్మిస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.370 నిర్ణయించి, అడ్వాన్సులు వసూలు చేసి ఉడాయిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి రూ.23 వేలు కాజేశారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే, జీపే చేయవద్దని, నకిలీ నర్సరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 4, 2026

ఖమ్మంలో ఈ-నామ్ 2.0 సేవలు షురూ

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్ 2.0’ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర, తూకం, కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

News March 4, 2026

ఖమ్మం: మొక్కజొన్న రైతులకు దక్కని భరోసా

image

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉండగా, బయట మార్కెట్లో దళారులు రూ.1,900కే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చేలోపే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యంగా కేంద్రాలు తెరిస్తే దళారులకే లాభమని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.