News June 21, 2024
పక్కపక్కనే కూర్చున్న రఘురామ.. అయ్యన్న

అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.
Similar News
News March 6, 2026
ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

News March 5, 2026
భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.