News June 21, 2024

24న వాచీలు, ఫోన్ల ఈ-వేలం

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

Similar News

News January 13, 2026

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

News January 13, 2026

చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

image

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.

News January 13, 2026

చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.