News June 21, 2024

త్వరలో గులాబీ పార్టీ ఖాళీ: దానం

image

TG: తమ పార్టీలో చేరేందుకు చాలామంది BRS నేతలు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ MLA దానం నాగేందర్ అన్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైందని, త్వరలో 20మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరతారని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయని, త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని దానం జోస్యం చెప్పారు.

Similar News

News March 17, 2026

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం: రోజూ స్వీట్ పొటాటో తింటే?

image

తక్కువ రేటుకు లభించే స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్-A, C, E, B6, పొటాషియం, పీచు తదితర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ‘రోజూ చిలగడదుంప తింటే వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, బీపీ, ఒత్తిడి తగ్గుతాయి. కంటి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 17, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.

News March 17, 2026

24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

image

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్‌ పోస్ట్‌’, ‘48 స్పీడ్‌ పోస్ట్‌‌’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.