News June 21, 2024

కల్తీ సారా.. మోగుతున్న మరణమృదంగం

image

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. కల్తీ నాటు సారా మృతుల సంఖ్య 47కి చేరినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Similar News

News January 12, 2026

సీబీఐ విచారణకు విజయ్

image

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

News January 12, 2026

మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

image

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు.

News January 12, 2026

మేడారం వెళ్తున్నారా? రూట్ మ్యాప్ ఇదే

image

TG: మేడారం జాతరకు ఈసారీ వన్ వే అమలు చేస్తున్నారు. WGL మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను పస్రా టూ నార్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. మహారాష్ట్ర, కరీంనగర్, BHPL నుంచి వచ్చే వాహనాలను కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వరకు అనుమతిస్తారు. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం వాహనాలను చిన్నబోయినపల్లి-కొండాయి నుంచి అనుమతిస్తారు. రిటర్న్ జర్నీకి ఇవే రూట్లు ఫాలో కావాలి. RTC, VIP వాహనాలకు తాడ్వాయి రూట్‌ను కేటాయించారు.